క్రైమ్

చిట్యాల వద్ద భారీగా నగదు పట్టివేత

నల్లగొండ : జిల్లాలో భారీ ఎత్తున డబ్బు పట్టుబడింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ – విజయవాడ హైవేపై చిట్యాల పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఓ కారు అనుమానాస్పదంగా కంట పడింది. పోలీసు తనిఖీలను పసిగట్టిన కారు డ్రైవర్ రూటు మార్చి తప్పించుకునే ప్రయత్నం చేయబోయి పోలీసులకు దొరికిపోయాడు.

కారును తనిఖీ చేస్తే ..అందులో 4 కోట్ల రూపాయల నగదు డబ్బు పట్టుబడింది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. (టీఎస్ 10 EY 6160) నెంబర్ గల కియా కారులో హైదరాబాద్ నుంచి చెన్నైకి డబ్బు తీసుకెళ్తుండగా చిట్యాల పోలీసులు చాకచక్యంగా వీరిని పట్టుకున్నారు. కాగా పట్టుబడ్డ డబ్బు ఎవరిదనేది మాత్రం పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close