తెలంగాణ

ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఐసోలేషన్‌ వార్డులు!

  • సీఎం కేసీఆర్‌కు హెచ్‌సీఏ లేఖ

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ నివారణ చర్యలకు తమ వంతు సాయం అందించడానికి పులువురు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ స్టేడియంలో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్‌ అజహరుద్దీన్‌ కోరారు. స్టేడియంలో 40 పెద్ద రూమ్‌లు ఉన్నాయని, పార్కింగ్‌ సదుపాయం కూడా ఉందని తెలిపారు. ఇది ఐసోలేషన్‌ కేంద్రంగా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ మేరకు హెచ్‌సీఏ సెక్రటరీ ఆర్‌ విజయానంద్‌ బుధవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ తరఫున కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై పోరాటానికి తమ వంతు సేవలు అందించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close