ఆంధ్రటాప్ స్టోరీస్బ్రేకింగ్ న్యూస్

హరికృష్ణ రాసిన చివరి లేఖ

మరో నాలుగు రోజుల్లో తన పుట్టినరోజు రానున్న నేపథ్యంలో నందమూరి హరికృష్ణ అభిమానులను ఉద్దేశించి ఓ లేఖ రాశారు. ప్రతీ పుట్టిన రోజున పూలదండలు, బొకేలతో ఎంతో మంది అభిమానులు వస్తుంటారు కాబట్టి, ఈ సారి అలా ఎవరూ రావద్దని కోరారు.
‘‘సెప్టెంబర్ 2న అరవై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరపవద్దని నా మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళ రాష్ట్రంలో వరదలు, వర్షాలు కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులైనారు. ఇది మన అందరికీ ఎంతో విషాదాన్ని కలిగించే విషయం. అందువల్ల నా జన్మదినం సందర్భంగా బేనర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, పుష్ప గుచ్ఛాలు, దండలు తీసుకురావద్దని వాటికి అయ్యే ఖర్చును వరదలు, వర్షాలు కారణంగా నష్టపోయిన కుటుంబాలకు అందజేయాలని కోరుతున్నాను. అంతేకాకుండా, నిరాశ్రయులైన వారికి దుస్తులు, వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు మీ శక్తి మేరకు అందజేయాలని కోరుతున్నాను.. ఇట్లు- మీ నందమూరి హరిక‌ృష్ణ’’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close