టాప్ స్టోరీస్తెలంగాణ

ఆగస్టు 1 నుంచి హజ్ యాత్ర

పవిత్ర  హజ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం హజ్ క్యాంప్ ఈ నెల 30న నాంపల్లిలో హజ్ హౌస్‌లో ప్రారంభమవుతుందని ఉపముఖ్యమంత్రి మహమూద్ ఆలీ తెలిపారు. తొలి విమానం ఆగస్టు ఒకటిన హైదరాబాద్ నుంచి జెడ్డాకు బయల్దేరుతుందని, చివరి విమానం ఆగస్టు 16న వెళ్తుందని పేర్కొన్నారు. హజ్ యాత్రికులకు కల్పించాల్సిన వసతులు, సదుపాయాలపై గురువారం హజ్‌హౌస్‌లో నిర్వహించిన సమీక్షలో మహమూద్ ఆలీ, మైనారిటీ శాఖ సలహాదారు ఎ.కే. ఖాన్ వక్ఫ్  బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం తదితరులు వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు చెందిన 7800 మంది యాత్రికులు హైదరాబాద్‌ నుంచి వెళ్తారని ఉపముఖ్యమంత్రి తెలిపారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close