సినిమా

‘ఈతరం’ ఫిల్మ్స్ బ్యానర్ పై గోపీచంద్ మూవీ!

  • ‘పక్కా కమర్షియల్’ పూర్తి కావొచ్చింది
  • శ్రీవాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాను
  • యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగుతుంది
  • సొంత బ్యానర్లో ఒక సినిమా ఉంటుందన్న గోపీచంద్   

గోపీచంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ సినిమా రూపొందింది. తమన్నా కథానాయికగా నటించిన ఈ సినిమా కబడ్డీ నేపథ్యంలో కొనసాగుతుంది. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లలో గోపీచంద్ బిజీగా ఉన్నాడు.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన తదుపరి సినిమాలను గురించిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. ‘సీటీమార్’ తరువాత సినిమాగా ‘పక్కా కమర్షియల్’ ఉంటుంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చాలా వరకూ పూర్తయింది. ఈ సినిమాలో నా జోడీగా రాశిఖన్నా కనిపిస్తుంది.

ఇక ఆ తరువాత దర్శకుడు శ్రీవాస్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాను. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా ఈ సినిమా ఉంటుంది. మా హోమ్ బ్యానర్ అయిన ‘ఈతరం ఫిలిమ్స్’ను మళ్లీ మొదలుపెట్టాలనుకుంటున్నాము. ఈ బ్యానర్ పై ఒక సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే అందుకు కాస్త సమయం పట్టొచ్చు” అని చెప్పుకొచ్చాడు.

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close