ఆంధ్ర

తిరుమల భక్తులకు శుభవార్త.. ప్రారంభమైన సర్వదర్శన టోకెన్ల జారీ

  • కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 12 నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత
  • కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరిగి పునరుద్ధరణ
  • తొలి విడతగా చిత్తూరు జిల్లా భక్తులకు రోజుకు 2 వేల చొప్పున పంపిణీ

తిరుమలను సందర్శించాలనుకునే సామాన్య భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 12 నుంచి నిలిపివేసిన సర్వదర్శన టోకెన్ల జారీని నిన్నటి నుంచి పునరుద్ధరించింది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడం, శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా తొలి విడతగా చిత్తూరు జిల్లాకు చెందిన భక్తులకు రోజుకు 2 వేల చొప్పున టోకెన్లు పంపిణీ చేస్తోంది. తిరుమలలోని శ్రీనివాసం యాత్రికుల వసతిగృహ సముదాయంలో నిన్న ఉదయం ఆరు గంటలకు టోకెన్ల జారీ ప్రారంభం కాగా ఉదయం పది గంటల కంటే ముందే పూర్తయింది.  రోజు వారీ టోకెన్లను ఏ రోజుకారోజే అందించనున్నారు. టీటీడీ తాజా నిర్ణయంపై సామాన్య భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close