జాతీయంబిజినెస్

జీఎమ్మార్‌ నష్టం రూ.279 కోట్లు

హైదరాబాద్‌ కేంద్రస్థానంగా విమానాశ్రయాలు, రోడ్లు నిర్వహిస్తున్న జీఎమ్మార్‌ ఇన్‌ఫ్ట్రాస్రక్చర్‌ లిమిటెడ్‌ క్రమంగా నష్టాలను తగ్గించుకుంటున్నది. డిసెంబర్‌ 31తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.279 కోట్ల నష్టం వచ్చింది. 2018-19 ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.542 కోట్లతో పోలిస్తే భారీగా తగ్గింది. సమీక్షకాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్‌ ఆదాయం రూ.1,958 కోట్ల నుంచి రూ.2,196 కోట్లకు పెరిగినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. వీటిలో విమానాశ్రయాలను నిర్వహించడం ద్వారా రూ.1,615.20 కోట్ల ఆదాయం సమకూరగా, విద్యుత్‌ విభాగం నుంచి రూ.207.20 కోట్లు లభించింది. 

అంతక్రితం ఏడాది రూ.1,358.3 కోట్లు, రూ.145.7 కోట్లుగా ఉన్నది. మూడో త్రైమాసికంలో ఢిల్లీ విమానాశ్రయం గుండా 1.87 కోట్ల మంది ప్రయాణించగా, అలాగే హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి 59 లక్షల మంది ప్రయాణించినట్లు తెలిపింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ నిర్వహణ ద్వారా సంస్థకు రూ.143 కోట్ల ఆదాయం సమకూరింది. అలాగే శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి రూ.241 కోట్లు లభించాయి. 2022 నాటికి ఢిల్లీ విమానాశ్రయ సామర్థ్యాన్ని ఆరు కోట్ల నుంచి 10 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ..హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ను 1.2 కోట్ల నుంచి 3.4 కోట్లకు పెంచాలనుకుంటున్నది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close