క్రైమ్జాతీయం

ఊహించ‌ని ట్విస్ట్‌..ఆ 35 మంది బాలిక‌లు చ‌నిపోలేదు

బీహార్ : బిహార్‌లోని వ‌స‌తి గృహాల్లో సుమారు 35 మంది బాలిక‌లను అత్యాచారం చేసి చంపిన ఘ‌ట‌న‌పై ఇవాళ సీబీఐ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఆ బాలిక‌లు ఎవ‌రూ చ‌నిపోలేద‌ని సుప్రీంకోర్టుకు సీబీఐ చెప్పింది. షెల్ట‌ర్ హోమ్స్‌లో జ‌రిగిన రేప్ ఘ‌ట‌న‌ల‌పై సీబీఐ త‌న ద‌ర్యాప్తును పూర్తి చేసి నివేదిక‌ను కోర్టుకు స‌మ‌ర్పించింది. రాజ‌కీయ నాయ‌కుల‌తో లింకు ఉన్న బ్ర‌జేశ్ థాకూర్ అనే వ్య‌క్తి వ‌స‌తి గృహాల్లో బాలిక‌ల‌పై అఘాయిత్యాల‌కు పాల్ప‌డి ఉంటార‌ని గ‌త ఏడాది సీబీఐ త‌న నివేదిక‌లో చెప్పింది. అత‌ని వ‌ల్ల సుమారు 11 మంది అమ్మాయిలు చ‌నిపోయి ఉంటార‌ని కూడా పేర్కొన్న‌ది. కానీ ఇవాళ త‌న నివేదిక‌లో సీబీఐ మొత్తం క‌థ‌నాన్ని మార్చేసింది. ముజ‌ఫ‌ర్‌ఫూర్‌లోని ఓ వ‌స‌తి గృహం నుంచి కేవ‌లం ఇద్ద‌రి అస్థిపంజ‌రాల‌ను సేక‌రించామ‌ని, మైనర్ అమ్మాయిల‌కు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లభించ‌లేద‌ని సీబీఐ వెల్ల‌డించింది. చనిపోయిన‌ట్లు భావించిన బాలిక‌లు బ్ర‌తికే ఉన్నార‌ని సీబీఐ త‌ర‌పున వాదించిన అటార్నీ జ‌న‌ర‌ల్ కేకే వేణుగోపాల్ తెలిపారు. బీహార్‌లో మొత్తం 17 షెల్ట‌ర్ హోమ్స్‌పై విచార‌ణ జ‌రిపింద‌ని, నాలుగు కేసుల్లో 13 చార్జ్‌షీట్లు దాఖ‌లు చేసిన‌ట్లు సీబీఐ పేర్కొన్న‌ది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close