ఆంధ్రబ్రేకింగ్ న్యూస్

ప్రేమ దక్కదన్న భయంతో యువతి ఆత్మహత్య

ప్రేమించిన వాడు దక్కడేమో అన్న అనుమానం, తల్లిదండ్రులకు తెలిసిపోయిందన్న భయం ఓ యువతి ప్రాణాలను బలి తీసుకుంది. తల్లిదండ్రుల కళ్ల ముందే మూడంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడి, వారికి కడుపుకోత మిగిల్చింది. అత్యంత విషాదకరమైన ఈ సంఘటన హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో చోటు చేసుకుంది.

పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ మండలం రొంపిగుంటకు గ్రామానికి చెందిన మహ్మద్‌ సనా ముషీరాబాద్‌ ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ పాలిటెక్నిక్‌ చదువుకుంటోంది. కొంతకాలంగా ఆమె ఓ యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, గ్రామానికి తీసుకెళ్లిపోవడానికి ఇవాళ హాస్టల్‌కు వచ్చారు. వారితో వాగ్వాదానికి దిగిన సనా.. మూడంతస్తుల హాస్టల్ భవనంపైకి ఎక్కి దూకేసింది. వెంటనే ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. కళ్లముందే కూతురు ఆత్మహత్యకు పాల్పడడాన్ని చూసి కుమిలిపోతున్నారుఆమె తల్లిదండ్రులు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close