క్రైమ్టాప్ స్టోరీస్తెలంగాణ

హైదరాబాద్ పబ్‌లో కిడ్నాప్‌…ఆ తర్వాత

బంజారాహిల్స్‌లో ఓ యువతి కిడ్నాప్ కలకలం రేపింది. పబ్‌లో ఉన్న ఆ యువతిపై బ్లేడ్లతో దాడి చేసి కిడ్నాప్ చేశారు. మూడురోజులు కిందట చోటుచేసుకున్న ఈ వ్యవహరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తనను ఫిరోజ్, కీర్తి రెడ్డిలు కలిసి దారుణంగా హింసించారని, తన డబ్బును తీసుకుని తిరిగి ఇవ్వకపోగా, హత్య చేస్తామని బెదిరిచారని బాధితురాలు సమీర వాపోయింది. తనతో వ్యభిచారం చేయించాలని వారిద్దరూ బలవంతం చేశారని, అందుకు అంగీకరించలేదని తనపై బ్లేడ్లతో దాడి చేశారని తెలిపింది. తనను కారులో ఎక్కించుకుని బలవంతంగా మద్యం తాగించి బాగా కొట్టారని, ఫిరోజ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు ఆరోపించింది.

బంజారాహిల్స్‌లోని జీవీకే మాల్‌ ముందు తన బట్టలు చింపేశారని, తాను సెమీ న్యూడ్‌గా పరుగెడుతుంటే వీడియో తీసి, వాటిని వైరల్‌ చేశారని సమీర విలపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న  నిందితుల కోసం గాలిస్తున్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close