సినిమా

విలన్ గా జయసుధ తనయుడి ఎంట్రీ!

  • ‘బస్తీ’తో పరిచయమైన జయసుధ పెద్ద కుమారుడు  
  • ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’తో రెండవ కుమారుడి ఎంట్రీ
  • ఈషాన్ సూర్య దర్శకత్వంలో ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ 

తెలుగు తెరకి చాలామంది వారసులు పరిచయమవుతున్నారు. అలా జయసుధ పెద్ద కొడుకు శ్రేయాస్ కూడా కొంతకాలం క్రితం, ‘బస్తీ’ అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. శ్రేయాస్ మంచి ఒడ్డూ పొడుగూ ఉంటాడు. ఆయన హైట్ కి తగిన హీరోయిన్ దొరకడం కష్టమేనని అంతా అనుకున్నారు. నటుడిగా ఆయన రాణించాలనుకుంటే, చాలా కసరత్తు చేయవలసి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ‘బస్తీ’ సినిమా ఎక్కడా నిలబడలేదు .. ఆ తరువాత శ్రేయాస్ హీరోగా మరో ప్రయత్నం కూడా చేయలేదు.

ఇక ఇప్పుడు జయసుధ రెండవ తనయుడు నిహార్ కపూర్ ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే హీరోగా కాదు .. విలన్ గా. నీహార్ నటుడిగా తెరపైకి వద్దామని అనుకుంటే, ఆయన పర్సనాలిటీ .. హైటు చూసినవారు, విలన్ పాత్రలకి బాగా సెట్ అవుతావనే అభిప్రాయాలు వ్యక్తం చేశారట. దాంతో ఆయన అదే నిర్ణయం తీసుకుని రంగంలోకి దిగిపోయాడు.

ఈషాన్ సూర్య దర్శకత్వంలో ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ సినిమా రూపొందుతోంది. లక్ష్ – వేదిక జంటగా నటిస్తున్న ఈ సినిమాలో, నిహార్ విలన్ గా పరిచయమవుతున్నాడు. నిన్న ఆయన పుట్టినరోజు కావడంతో ఈ సినిమా నుంచి ఆయన ఫస్టులుక్ ను వదిలారు. మరో విలన్ గా నిహార్ నిలదొక్కుకుంటాడేమో చూడాలి.  

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close