క్రీడలుటాప్ స్టోరీస్

ఐపీఎల్‌ ఆడే క్రికెటర్లకు నాలుగుసార్లు కరోనా పరీక్షలు

ముంబై: యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19న ఆరంభంకానున్న ఐపీఎల్‌-2020 సీజన్‌ కోసం బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.   భారత్‌ నుంచి ఐపీఎల్‌లో పాల్గొనేందుకు వెళ్లే  ఆటగాళ్లకు  రెండువారాల్లో నాలుగుసార్లు కరోనా  పరీక్షలు నిర్వహించనున్నారు. ఐపీఎల్‌ కోసం  వెళ్లేముందు  భారత్‌లో రెండుసార్లు.. యూఏఈలో క్వారంటైన్‌లో ఉన్నప్పుడు మరో రెండుసార్లు కరోనా పరీక్షలు చేస్తారు. 

యూఏఈలోకి వచ్చే ప్రతీ ప్రయాణికుడికి కరోనా పరీక్షలు తప్పనిసరి.  ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి కూడా ఇదే రూల్‌ వర్తించనుంది. ఆటగాళ్లు, ఫ్రాంఛైజీ యజమానులంతా ఈ నిబంధనల్ని  కచ్చితంగా  పాటించాలని బీసీసీఐ సూచించింది. 

యూఏఈ వెళ్లే ప్రతీ ఆటగాడు DXB యాప్‌ను తమ స్మార్ట్‌ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కరోనా నేపథ్యంలో  భారత్‌లో ఆరోగ్యసేతు యాప్‌ మాదిరిగానే యూఏఈ యాప్‌ను రూపొందించింది. భౌతిక దూరం తదితర నిబంధనలను మైదానంలో లోపల, బయట  ప్రతిఒక్కరూ తప్పకుండా పాటించాల్సిందే.  మరోవైపు ఆటగాళ్లంతా ఒకేసారి బయో బబుల్‌లో అడుగుపెట్టాల్సి ఉంటుంది. 

ప్రతి టీమ్‌లో 20 కన్నా ఎక్కువ మంది ఆటగాళ్లు ఉన్నారు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఒకేసారి 15 మంది ఆటగాళ్లకు మించి అనుమతిలేదు.  వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు అమలు చేసిన నిబంధనలను పరిగణనలోకి తీసుకొని బీసీసీఐ మార్గదర్శకాలు రూపొందిస్తున్నది. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close