అంతర్జాతీయంటాప్ స్టోరీస్టెక్నాలజీస్పెషల్

ఎగిరే కార్లు వచ్చాయోచ్…!

ఏదో చదివించడానికి ఈ టైటిల్ పెట్టలేదండోయ్…నిజంగానే ఎగిరే కార్లు వచ్చాయి. ఎగిరే ఏనుగుల కథలు విన్నవే అందులో విశేషమేమి లేదు. కానీ ఎగిరే కార్లు కథకాదండోయ్..ఇది పక్కా రియల్..

లగ్జరీ కార్లు, విమానాల ఇంజన్లు తయారు చేయడంలో పేరు మోసిన బ్రిటీష్ సంస్థ రోల్స్ రాయిస్ హైబ్రిడ్ ఎలెక్ట్రిక్ వాహనాన్ని అభివృద్ధి చేసినట్టు వెల్లడించింది. ‘ఎగిరే టాక్సీ’ గా పిలువబడే ఈ వాహనానికి రన్‌వే అవసరం ఉండదు. ఉన్న చోటు నుంచి నిట్టనిలువునా గాల్లోకి ఎగరగలుగుతుంది. దీన్నివచ్చే ఐదేళ్లలో అందుబాటులోకి తెస్తామమని ప్రకటించింది రోల్స్ రాయిస్‌. ఇంగ్లాండ్‌లోని డర్బీలో నిర్వహించిన ఫ్రాన్‌ బ్రో ఎయిర్‌షోలో తొలిసారి దీనికి సంబంధించిన ప్రణాళికను ప్రదర్శించింది.

మరో 18 నెలల్లో దీనికి సంబంధించిన ప్రయోగాత్మక వాహనాన్ని తయారు చేయనున్నారు. సురక్షితంగా టేక్‌-ఆఫ్ మరియు ల్యాండింగ్ అయ్యే విధంగా దీన్ని రూపొందిస్తామన్నారు కంపెనీ ప్రతినిధులు. 2020వ సంవత్సరంలో కల్లా ఈ వాహనాన్ని గాల్లో ఎగిరేలా చేస్తామన్నారు. ఈ రోల్స్ రాయ్ ఎగిరే టాక్సీ నలుగురు నుంచి ఐదుగురు వ్యక్తులను మోసుకెళ్లగలుగుతుంది. గంటకు 200 మైళ్ల వేగంతో దూసుకెళ్తుంది. సుమారు 805 కిలో మీటర్ల దూరం వరకు గాల్లో ఆగకుండా ఎగరగలదు.

“మరో మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో ఎగిరే టాక్సీలను మీరు చూస్తారు. మేము ఈ వ్యవస్థని రెండు సంవత్సరాల్లో దిగ్విజయంగా ప్రదర్శించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తున్నాం.”  అని రోల్స రాయ్ ఎలెక్ట్రిక్ బృందం నిర్వహకుడు రాబ్ వాట్సన్ తెలిపారు.

ఈ హైబ్రిడ్ వాహనం చుట్టు ఎలెక్ట్రిక్ వ్యవస్థతో కూడిన సాంప్రదాయ గ్యాస్ టర్బైన్ ఇంజిన్‌ను అమర్చినట్లు రోల్స్‌ ప్రతినిధులు తెలిపారు. ఈ ఎగిరే టాక్సీ వాహనం పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించదని, ఈ వాహనం పర్యావరణ హితంగా తయారు చేయబడిందని ప్రముఖ అంతరిక్ష సలహాదారులు మరియు భాగస్వామి డేవిడ్ స్టీవర్ట్ కితాబిచ్చారు.

ఈ వాహనం ద్వారా ఇందన వ్యర్థాన్ని నియంత్రించడమే కాక.. వినియోగదారులను ఎంతగానో ఆకర్షించడంలో ఏ సందేహాం లేదని చెప్పవచ్చు. రోల్స్ హైబ్రిడ్  ఎగిరే ట్యాక్సీ మార్కెట్లో రావడంతో వివిధ అంతర్జాతీయ కంపెనీలు తమ పరిశోధనలను ముమ్మరం చేశాయి. యుకే టాక్సీ హైలింగ్ సంస్థ యుబర్, గూగుల్  ఆధారిత కిట్టి హాక్ ప్రాజెక్ట్ , జర్మనీలోని లిలియం ఏవియేషన్, ఫ్రాన్స్‌లోని సఫ్రాన్ మరియు యునెటెడ్ స్టేట్‌లోని హనీవెల్  కంపెనీలు రంగంలోకి దిగాయి. దీంతో రానున్న రోజుల్లో ఎగిరే టాక్సీలు సంచలనం సృష్టించనున్నాయి.

అదే విధంగా తాము మార్కెట్లోకి హైబ్రిడ్ ఎలెక్ట్రిక్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నామని, ఇది ఎంతో ఉత్తమమైన సౌకర్యం మరియు అధిక సామర్థ్యాన్ని ఇస్తుందని వాట్సన్ తెలిపారు. ఫ్యూయల్‌కు బదులుగా విద్యుత్ శక్తితో నడిచే విధంగా తయారు చేయడానికి ఎంతో కృషి చేశామని, కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఎగిరే కారును రూపొందించడంతో ఎలెక్ట్రిక్ పరిశ్రమలో ఎంతో అభివృద్ధి సాధించామని రోల్స్ రాయ్ అధికారులు తెలిపారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close