రాజకీయం

లాలూ లేకుండా తొలిసారిగా బీహార్ ఎన్నిక‌లు

ప‌ట్నా: లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌.. ఈ పేరు దేశ రాజ‌కీయాల్లో అంద‌రికి సుప‌రిచిత‌మే. త‌న సుదీర్ఘ రాజకీయ జీవితంలో బీహార్ ముఖ్య‌మంత్రిగా, కేంద్ర రైల్వే మంత్రిగా ప‌నిచేశారు. దాణా కుంభ‌కోణం కేసులో ప్ర‌స్తుతం జైలు శిక్ష అనుభ‌విస్తున్న విష‌యం తెలిసిందే. కాగా, బీహార్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో లాలూ పేరు మ‌రోమారు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎలా అంటే గ‌త నాలుగు ద‌శాబ్దాల కాలంలో లాలు లేకుండా మొద‌టిసారిగా బీహార్‌లో ఎన్నిక‌లు జరుగుతున్నాయి. సొంత పార్టీ ఆర్జేడీ ప్ర‌చార పోస్ట‌ర్ల‌లో కూడా ఆయ‌న ఫొటోకు స్థానం ల‌భించ‌క‌పోవ‌డం విశేషం. ‘కొత్త ఆలోచ‌న‌, స‌రికొత్త బీహార్’ (న‌యా సోచ్‌, న‌యీ బీహార్‌) అనే నినాదంతో ఎన్నిక‌ల బ‌రిలో ఆర్జేడీ నిలిచింది.   

72 ఏండ్ల లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ దాణా కుంభ‌కోణం కేసులో 2018 నుంచి జైలుజీవితం గ‌డుపుతున్నారు. దీంతో త‌న కుమారుడు తేజ‌స్వీ యాద‌వ్‌కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించారు. లాలూ లేకుండా తొలిసారిగా బీహార్ ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌ప్ప‌టికీ, జైలు నుంచే ఆయ‌న‌ అన్ని వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. 1977లో తొలిసారి ఎంపీగా ఎన్నికైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు లాలూ ఎప్పుడుకూడా ఎన్నిక‌ల ప్ర‌చారానికి దూరంగా ఉండ‌లేదు. 

అయితే దాణా కుంభ‌కోణానికి సంబంధించిన‌ ఓ కేసులో లాలూకి జార్ఖండ్ హైకోర్టు ఈరోజు బెయిల్ మంజూరు చేసింది. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న జైలునుంచి విడుద‌ల‌య్యే అవ‌కాశం లేకుండా పోయింది. దుమ్కా ఖ‌జానా కేసు పెండింగ్‌లో ఉండ‌ట‌మే దీనికి కార‌ణం. ఈ కేసు విచార‌ణ వ‌చ్చేనెల 9న ఉన్న‌ది. అంటే స‌రిగ్గా జార్ఖండ్ ఫ‌లితాల‌కు ఒక‌రోజు ముందు. ఆ కేసులో లాలూకి బెయిల్ ల‌భించినా ఫ‌లితం లేకుండా పోతుంది. అప్ప‌టికే ఎన్నిక‌ల ప్ర‌క్ర‌య పూర్త‌వుతుంది. 

  • లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ 1977లో ఆరో లోక్‌స‌భ‌కు మొద‌టిసారిగా ఎన్నిక‌య్యారు. 1980 నుంచి 89 వ‌ర‌కు బీహార్ అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. 1989లో ప్ర‌తిప‌క్ష నేత‌గా ఎన్నిక‌య్యారు. అనంత‌రం జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. 
  • 1990-97 వ‌ర‌కు బీహార్ ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. (1990-95 వ‌ర‌కు లెజిస్లేటివ్ కౌన్సిల్ స‌భ్యునిగా ఉండ‌గా, 1995-98 వ‌ర‌కు ఎమ్మెల్యేగా ఉన్నారు).  
  • 1996లో దాణా కుంభ‌కోణంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. దీంతో 1997లో త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. అనంత‌రం జ‌న‌తాద‌ల్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి రాష్ట్రీయ జ‌న‌తాద‌ల్ (ఆర్జేడీ)ని స్థాపించారు. 
  • 1998లో లోక్‌స‌భ స‌భ్యునిగా మూడోసారి ఎన్నిక‌య్యారు. 2004, 2009లో వ‌రుస‌గా ఎంపీగా గెలుపొందారు. 
Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close