క్రైమ్

తిరుమలలో అగ్నిప్రమాదం… ఒకరి సజీవదహనం

  • ఆస్థానమండపం వద్ద దుకాణాల్లో అగ్నిప్రమాదం
  • 8 దుకాణాలు అగ్నికి ఆహుతి
  • ఎంతో శ్రమించి మంటలు ఆర్పివేసిన అగ్నిమాపక దళం
  • షాపు నెం.84 నుంచి ఓ మృతదేహం వెలికితీత

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒకరు సజీవదహనం అయ్యారు. తిరుమలలోని ఆస్థాన మండపం సమీపంలోని దుకాణాల్లో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి 8 దుకాణాలు దగ్ధం అయ్యాయి. షాపు నెం.84 నుంచి శకలాలు తొలగిస్తుండగా ఓ మృతదేహం బయటపడింది. అతడిని దుకాణదారుడిగా గుర్తించారు. అగ్నిమాపక బృందాలు ఘటన స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఈ ఘటనలో తిరుమల వ్యాపార వర్గాల్లో విషాదం నెలకొంది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close