అంతర్జాతీయంటాప్ స్టోరీస్

సౌదిలో సంచలనం.. పైలెట్లుగా మహిళలు

అనేక సంస్కరణలతో సౌదీ అరేబియా అభివృద్ది దిశగా దూసుకెళ్తుంది. దేశ అభివృద్ది దోహదపడే అన్నీ రకాల సంస్కరణలు చేపడుతూ… అగ్రరాజ్య స్ధాయికి ఎదిగేందుకు కృషి చేస్తుంది. సంస్కరణల్లో భాగంగానే..మహిళలపై ఇప్పటివరకూ ఉన్న నిషేదాలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ సంస్కరణల దిశగా దూసుకెళ్తుంది సౌదీ అరేబియా.

తమ దేశ ప్రజలకు ఎంటర్ టైన్ మెంట్ ఖచ్చిత అవసరమని భావించిన సౌదీ…  ఇటీవల సినిమా థియేటర్లపై ఉన్న నిషేధాన్ని కూడా ఎత్తివేసింది. దేశంలో మహిళల డ్రైవింగ్ పై కొన్నేళ్లుగా కొనసాగుతున్న నిషేదాన్ని నెల రోజుల క్రితం తొలగించి, మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ లు ఇచ్చిన సౌదీ అరేబియా ఇప్పుడు తమ దేశ మహిళలు పైలెట్ లు అయ్యేందుకు అనుమతిచ్చింది. ఇప్పటికే ప్రముఖ ఆక్స్ ఫర్డ్ ఏవియేషన్ అకాడమీకి సౌదీ మహిళల నుంచి వందల సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి. సౌదీ అరేబియా ఈస్ట్రన్ ఫ్రావిన్స్ రాజధాని ధమ్మమ్ సిటీలో సెప్టెంబర్ నుంచి క్లాసులు స్టార్ట్ అవనున్నాయి.

ఏవియేషన్ తరగతుల కోసం చాలా మంది విదేశాలకు వెళ్తుంటారని, అయితే ఇది పురుషుల కంటే మహిళలకు చాలా కష్టమైన పనని పైలెట్ ఆశావహులు తెలిపారు. పరిమిత ప్రదేశాల్లో మాత్రమే మహిళలు పనిచేసే అవకాశం ఉన్న రోజులు పోయాయని, మహిళల కోసం ఇప్పుడు అన్నీ దారులు తెరుచుకున్నాయని సౌదీ మహిళలు తెలిపారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close