ఆంధ్ర

ఫిబ్రవరి 1 నుంచి సీఎం జగన్ గ్రామాల పర్యటన

  • ఏపీలో ‘రచ్చబండ’ తరహా కార్యక్రమం
  • సంక్షేమ పథకాల అమలు ఎలా ఉందో తెలుసుకోనున్న సీఎం
  • ప్రజలను అడిగి తెలుసుకోనున్న జగన్

ఏపీలో ‘రచ్చబండ’ తరహా కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి గ్రామాల్లో జగన్ పర్యటించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వం పని తీరు గురించి నేరుగా ప్రజలను అడిగి ఆయన తెలుసుకోనున్నారు.  ఈ నేపథ్యంలో అధికారులతో జగన్ సమీక్షించారు. గ్రామాల్లో పర్యటించాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. త్వరలో శ్రీకారం చుట్టనున్న ఈ కార్యక్రమానికి ‘రచ్చబండ’ అనే పేరును ఖరారు చేస్తారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2009లో రెండోసారి సీఎం అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్తూరు జిల్లాలో ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. ఆ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు హెలికాఫ్టర్ లో వెళుతున్న సమయంలో సంభవించిన ఘోర ప్రమాదంలో రాజశేఖర్ రెడ్డి చనిపోయారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close