జాతీయం

కేంద్రం తెచ్చిన బిల్లులను నిరస్తూ ఈ నెల 26 నుంచి రైల్‌రోకో

న్యూఢిల్లీ : కేంద్రం ప్రభుత్వం తీసువచ్చిన మూడు వివాదాస్పద బిల్లులను తీసుకువచ్చి గురువారం ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాటిని వ్యతిరేకిస్తూ ఈ నెల 26 వరకు రైల్‌రోకో చేపట్టి, ఆందోళన ఉధృతం చేయాలని పంజాబ్‌కు చెందిన రైతు సంఘం శుక్రవారం నిర్ణయించింది. ఈ సందర్భంగా మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రావణ్‌ సింగ్‌ పండర్‌ అన్నారు.

అలాగే పంజాబ్‌లోని పలు రైతు సంఘాలు సైతం ఇప్పటికే బిల్లులకు నిరసనగా ఈ నెల 25న బంద్‌కు పిలుపునిచ్చాయి. గురువారం కేంద్ర ప్రభుత్వం రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) బిల్లు, రైతుల (సాధికారత-రక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లు, నిత్యావసర సరుకుల (సవరణ) బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పంజాబ్‌లోని కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ చట్టాలను సమాఖ్య నిర్మాణంపై దాడిగా అభివర్ణించింది.

లోక్‌సభ వాయిస్‌లో ఓటింగ్‌ ద్వారా ఆమోదించిన మూడు బిల్లులను వ్యతిరేకిస్తూ శిరోమణి అకాలీదళ్‌ పార్టీకి చెందిన ఎంపీ హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల మంత్రిత్వశాఖకు రాజీనామా చేసింది. రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ రాజీనామాను ఆమోదించి, మంత్రిత్వశాఖ బాధ్యతలను మరో మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌కు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన సైతం విడుదల చేసింది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close