సినిమా

సుహాస్ హీరోగా ‘ఫ్యామిలీ డ్రామా’ .. ఫస్టులుక్!

  • ‘కలర్ ఫొటో’తో మంచి క్రేజ్
  • హీరోగా మరో ప్రయత్నం
  • దర్శకుడిగా మెహర్ తేజ్ పరిచయం
  • అజయ్-సంజయ్ సమకూరుస్తున్న సంగీతం 

సుహాస్ చిన్నచిన్న పాత్రలతోనే తన కెరియర్ ను మొదలుపెట్టాడు. అయితే ఆయన హీరోగా చేసిన ‘కలర్ ఫొటో’ సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో సుహాస్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఆయన నటనలోని సహజత్వం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత మళ్లీ తనకి వచ్చిన పాత్రలను సద్వినియోగం చేసుకుంటూ వెళ్లిన ఆయన, ఇప్పుడు మళ్లీ హీరోగా ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఆయన హీరోగా చేస్తున్న ఆ సినిమా పేరే ‘ ఫ్యామిలీ డ్రామా’.విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. మెహర్ తేజ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఛాష్మ ఫిలిమ్స్ .. నూతన భారతి ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. టైటిల్ ‘ఫ్యామిలీ డ్రామా’నే అయినప్పటికీ, పోస్టర్ చూస్తుంటే క్రైమ్ నేపథ్యంలో సాగే కథగానే అనిపిస్తోంది. పూజా కిరణ్ – శృతి నోరి ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. వీరికి కూడా తెలుగులో ఇదే మొదటి సినిమా. అజయ్ – సంజయ్ లు ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నారు.

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close