టాప్ స్టోరీస్తెలంగాణ

బీజేపీ బీఫామ్‌ ఇస్తామన్నా..ఎవరూ తీసుకోవడం లేదు

హైదరాబాద్‌: ‘మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే ఘన విజయం. వందకు పైగా మున్సిపాల్టీలు గెలుచుకుంటాం. పల్లె ప్రగతి లాగే పట్టణ ప్రగతిపై కూడా చిత్తశుద్ధితో ఉన్నాం. కొత్త మున్సిపల్‌ చట్టాన్ని నిక్కచ్చిగా అమలు చేస్తాం. కౌన్సిలర్లను తీసేయాల్సి వస్తే మా పార్టీ నుంచే మొదలు పెడతాం. తప్పు చేస్తే అధికారుల్ని కూడా సర్వీస్‌ నుంచి సస్పెండ్‌ చేస్తామని’ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభివృద్ధి, రాజకీయాలు, మున్సిపల్‌ ఎన్నికలు వంటి పలు అంశాలపై అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ సమాధానమిచ్చారు.
‘మున్సిపల్‌ అభ్యర్థుల్ని ఎమ్మెల్యేలు ఎంపిక చేశారు. 2009 నుంచి టీఆర్‌ఎస్‌ ఇదే విధానం పాటిస్తోంది. రెబల్స్‌ ఎక్కువగా ఉండటం మా పార్టీ బలానికి నిదర్శనం. రెబల్స్‌ సమస్య 90శాతం పరిష్కారమైంది. మిగతా 10శాతం మందిని కూడా బుజ్జగిస్తాం. కాంగ్రెస్‌ మా సమీప ప్రత్యర్థి. కాంగ్రెస్‌ ఓట్ల శాతం పరంగా మాకు చాలా దూరంలో ఉంది. బీజేపీవి ఒట్టిమాటలే.. వాళ్లకు బలం లేదు. బీజేపీ బీఫామ్‌ ఇస్తామన్నా.. ఎవరూ తీసుకోవడం లేదు. అడ్డిమార్‌ గుడ్డి దెబ్బన నాలుగు ఎంపీ సీట్లు గెలిచారు. పట్ణణాల్లో గత ఐదేళ్లలో ఎంతో మార్పు వచ్చింది. అభివృద్ధి పనులు చేసి చూపించాం. విద్యుత్‌, మంచినీటి సమస్యల్ని దూరం చేశాం. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పాలిస్తున్నాం. అందుకే హైదరాబాద్‌లో ఘన విజయాలు సాధించాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తే.. అక్కడి ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. పొరుగువారితో ఎప్పుడూ సత్సంబంధాలే పెట్టుకున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో మమ్మల్ని డిస్టర్బ్‌ చేయాలని చూశారు. మేం ఎప్పుడూ ఆయన్ను అవమానించలేదు. ఏపీలో 3 రాజధానుల అంశం ఆ రాష్ట్ర ప్రజల పరిధిలో ఉందని’ కేటీఆర్‌ పేర్కొన్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close