క్రీడలు

చెన్నై విమానాశ్ర‌యానికి చేరుకున్న ఇంగ్లండ్ క్రికెట్ జ‌ట్టు

  • ఇంగ్లండ్‌తో 4 టెస్టులు, 3 వ‌న్డేలు, 5 టీ20 మ్యాచులు
  • ఫిబ్ర‌వ‌రి 5 నుంచి చెన్నైలో ఇరు జ‌ట్ల మ‌ధ్య‌‌ తొలి టెస్టు మ్యాచు
  • శ్రీలంక నుంచి నేరుగా భార‌త్ వ‌చ్చిన ఇంగ్లండ్ జ‌ట్టు

ఆసీస్‌తో ఇటీవ‌ల‌ జరిగిన టెస్ట్ సిరీస్‌లో విజయం సాధించి జోరు మీదున్న భార‌త్ త్వ‌ర‌లోనే ఇంగ్లండ్‌తో 4 టెస్టులు, 3 వ‌న్డేలు, 5 టీ20 మ్యాచులు ఆడ‌నుంది. ఫిబ్ర‌వ‌రి 5 నుంచి చెన్నైలో ఇరు జ‌ట్ల మధ్య తొలి టెస్టు మ్యాచు జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఇంగ్లండ్ జ‌ట్టు శ్రీలంక నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకి చేరుకుంది.  

విమానాశ్ర‌యంలో వారికి కరోనా ప‌రీక్ష‌లు చేశారు. భార‌త్-ఇంగ్లండ్ మ‌ధ్య‌ తొలి టెస్టు చెన్నైలోని చిదంబ‌రం స్టేడియంలో జ‌ర‌గ‌నుం‌ది. ఈ నేప‌థ్యంలో భార‌త క్రికెట‌ర్లు కూడా ఈ రోజు చెన్నై చేరుకుంటారు. ఇరు జ‌ట్ల ఆట‌గాళ్లు ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారు.  

కాగా, వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌లో భాగంగానే ఇంగ్లండ్‌- భార‌త్‌ మ‌ధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇంగ్లండ్ జ‌ట్టు కూడా బ‌లంగా ఉంది. శ్రీలంక‌తో ఇటీవ‌ల జ‌రిగిన రెండు టెస్టుల్లోనూ ఇంగ్లండ్ గెలిచింది. మ‌రోవైపు, భార‌త్ బ‌లంగానే ఉన్న‌ప్ప‌టికీ, జ‌ట్టును గాయాలబెడ‌ద బాధిస్తోంది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close