అంతర్జాతీయంటాప్ స్టోరీస్

ట్రిలియ‌నీర్ కాబోతున్న ఎల‌న్ మ‌స్క్ !

లాస్ ఏంజిల్స్: టెస్లా ఎలక్ట్రిక్ కార్ల‌తో ఎల‌న్ మస్క్ ప్ర‌పంచ మేటి సంప‌న్నుడ‌య్యాడు. ఇక ఇప్పుడు అత‌ను బిలియ‌నీర్ నుంచి ట్రిలియ‌నీర్‌గా మార‌బోతున్నాడు. మోర్గ‌న్ స్టాన్లీ చేసిన అంచ‌నాల ప్ర‌కారం .. స్పేస్ఎక్స్ సంస్థ‌తో మ‌స్క్.. ట్రిలియ‌నీర్‌గా ఎద‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. రాకెట్ల ప్ర‌యోగాలతో స్పేస్ఎక్స్ అనూహ్య రీతిలో బ‌ల‌ప‌డుతోంది. దీంతో మ‌స్క్ ఆస్తుల విలువ కూడా రాకెట్‌లా దూసుకువెళ్తున్న‌ది. అమిత‌వేగంతో స్పేస్ఎక్స్ వెళ్తున్న తీరును చూస్తుంటే మ‌స్క్‌ను ఎవ‌రూ అందుకోలేర‌ని పిస్తోంద‌ని ఆడ‌మ్ జోనాస్ త‌న రిపోర్ట్‌లో పేర్కొన్నారు. స్పేస్ఎక్స్‌ విలువ సుమారు 241.4 బిలియ‌న్ల డాల‌ర్లు. బ్లూమ్‌బ‌ర్గ్ బిలియ‌నీర్ల జాబితా ప్ర‌కారం ఆ విలువ‌లో 17 శాతం వాటా ఎల‌న్ మ‌స్క్‌దే. స్పేస్ ఎక్స్ ఓ బ‌హుళ కంపెనీల స‌మాహారం అని జోన‌స్ త‌న రిపోర్ట్‌లో పేర్కొన్నారు. స్పేస్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చర్‌, ఎర్త్ అబ్జ‌ర్వేష‌న్‌, డీప్ స్పేస్ ఎక్స్‌ప్లోరేష‌న్‌, ఇత‌ర ప‌రిశ్ర‌మ‌లో ఆ గ్రూపులో భాగ‌మైన‌ట్లు తెలిపారు. మ‌స్క్ ఆస్తుల విలువ పెర‌గ‌డంలో స్టార్‌లింక్ శాటిటైల్ క‌మ్యునికేష‌న్ వ్యాపారం కీల‌క‌మైంద‌ని జోన‌స్ అంచ‌నా వేశారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close