సినిమా

సంక్రాంతికి సై అంటున్న మరో ప్రముఖ నటుడు!

  • సంక్రాంతికి రెడీ అవుతున్న భారీ సినిమాలు
  • జనవరి 7న వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’
  • 12న రిలీజ్ అవుతున్న ‘భీమ్లా నాయక్’
  • 13, 14 తేదీల్లో ‘సర్కారువారి పాట’, ‘రాధేశ్యామ్’    
  • రాజశేఖర్ తాజా చిత్రం ‘శేఖర్’ కూడా రెడీ  

వచ్చే సంక్రాంతికి తెలుగు సినీ ప్రేక్షకులకు మంచి సినిమాల విందు రెడీ అవుతోంది. ఇప్పటికే పలువురు నిర్మాతలు తమ తమ సినిమాలను పెద్ద పండుగకి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. వీటిలో పలువురు స్టార్ హీరోల సినిమాలు వున్నాయి.

ముఖ్యంగా ఎన్టీఆర్, చరణ్ కలసి నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం జనవరి 7న విడుదల కావడానికి రెడీ అవుతుండగా, పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక మహేశ్ బాబు నటిస్తున్న ‘సర్కారువారి పాట’ జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. అలాగే, ప్రభాస్ నటించిన మరో భారీ చిత్రం ‘రాధేశ్యామ్’ జనవరి 14న థియేటర్లకు రావడానికి సర్వం సిద్ధం చేసుకుంది.

ఈ క్రమంలో మరికొన్ని సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ అవడానికి లైన్లో చేరుతున్నాయి. అందులో ప్రముఖ నటుడు డా.రాజశేఖర్ సినిమా కూడా వుంది. లలిత్ కుమార్ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా రూపొందుతున్న ‘శేఖర్’ చిత్రాన్ని కూడా పెద్ద పండుగకి రిలీజ్ చేయడానికి నిర్మాతలు తాజాగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

జోజు జార్జ్ ప్రధాన పాత్రలో మలయాళంలో వచ్చిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘జోసెఫ్’ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంటున్న కొన్ని అనుమానాస్పద యాక్సిడెంటు కేసుల్ని రిటైరైన ఓ పోలీసాఫీసర్ ఎలా పరిష్కరించాడన్నది ఇందులో థ్రిల్లింగ్ గా చూపిస్తున్నారు. ఇది రాజశేఖర్ నటిస్తున్న 91వ చిత్రం కావడం విశేషం. ఓపక్క అంతటి స్టార్ హీరోల భారీ సినిమాలు విడుదలవుతుండగా, మరి ఆ పోటీని తట్టుకుని ఈ ‘శేఖర్’ సినిమా ఎలా నిలబడుతుందో చూడాలి!

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close