తెలంగాణరాజకీయం

నేడు టీఆర్‌ఎస్‌ బీ ఫాంల పంపిణీ

  • ఎమ్మెల్యేలు, ఇంచార్జీలకు అందజేత
  • పాల్గొననున్న సీఎం కేసీఆర్‌

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సమావేశం గురువారం ఉదయం 10 గంటలకు తెలంగాణభవన్‌లో జరగనున్నది. పార్టీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొని మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన ఏ, బీ ఫారాల జారీకి సంబంధించిన విధివిధానాలను వివరిస్తారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి.. ఎమ్మెల్యేలు, ఇంచార్జీలకు ఏ, బీ ఫారాలు అందజేస్తారు. కాగా, మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపిక దాదాపుగా ఒక కొలిక్కి వచ్చింది.
అత్యధికంగా పోటీ ఉన్న స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ముగిసింది. వారందరినీ నామినేషన్లు వేసుకోవాలని.. ప్రచారాన్ని ప్రారంభించుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఇంచార్జీలు సూచించారు. అభ్యర్థులు టిక్కెట్లు ఆశించినవారితోపాటు పార్టీ నాయకులందరిని సమన్వయంచేసుకోవాలని, ప్రచార సామగ్రి సిద్ధంచేసుకోవాలని ఆదేశించారు. ప్రచారంలో పండుగకూడా వస్తున్నందున అందుకు అనుగుణంగా ప్రణాళికను రూపొందించుకోవాలని చెప్తున్నారు. ఓటరు జాబితాలో స్థానికంగా ఉండనివారిని గుర్తించి, పోలింగ్‌ రోజున రప్పించే విధంగా వారితో టచ్‌లో ఉండాలని.. ఇందుకోసం పార్టీ నాయకులకు కొందరికి బాధ్యతలు అప్పగించాలని సూచించారు. పట్టణాల్లో సామాజిక మీడియా ప్రభావం ఎక్కువ ఉన్నందున దానిపై దృష్టి పెట్టాలని , వాటిద్వారా కూడా విసృ్తత ప్రచారం నిర్వహించాలని, పార్టీ లక్ష్యాలు, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అభ్యర్థులను ఆదేశించారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close