స్పెషల్

వైజాగ్ లో తీవ్ర విషాద ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్ గురించిన వివరాలు

 • 1961లో హిందూస్థాన్ పాలిమర్స్ గా ప్రస్థానం ఆరంభం
 • 1997లో టేకోవర్ చేసిన ఎల్జీ కెమ్
 • ఎగుమతుల రంగంలో అగ్రగామిగా గుర్తింపు

ప్రశాంతతకు మారుపేరులా నిలిచే తూర్పు తీరప్రాంత నగరం వైజాగ్ ఇప్పుడు తీవ్ర విషాదంతో తల్లడిల్లుతోంది. నగర శివారుప్రాంతం ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి లీకైన విషవాయువు తొమ్మిది మందిని కబళించింది. వెయ్యి మందికి పైగా వివిధ ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ ఘటనతో ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో సదరు సంస్థ గురించిన వివరాలు ఇవిగో…

 • ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ కెమికల్ లిమిటెడ్ సంస్థకు చెందినది. ఎల్జీ కెమికల్ లిమిటెడ్ సంస్థ ప్రముఖ బ్యాటరీ తయారీదారుగా, పాలీస్టిరీన్ ఉత్పత్తిదారుగా గుర్తింపు పొందింది.
 • ఈ సంస్థను మొదట హిందూస్థాన్ పాలిమర్స్ పేరిట 1961లో స్థాపించారు.
 • ఆ తర్వాత 1978లో ఇది యూబీ గ్రూప్ కు చెందిన మెక్ డోవెల్ అండ్ కో లిమిటెడ్ లో విలీనమైంది.
 • 1997లో ఈ సంస్థను దక్షిణ కొరియాకు చెందని ఎల్జీ కెమ్ టేకోవర్ చేసి ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎల్జీపీఐ)గా నామకరణం చేసింది.
 • దక్షిణ కొరియాలో ఈ సంస్థ స్టిరీన్ ఉత్పత్తుల విషయంలో దిగ్గజం అని చెప్పాలి.
 • వైజాగ్ లోని ఎల్జీ పాలిమర్స్ సంస్థలో పాలీస్టిరీన్ ఉత్పత్తులు తయారుచేస్తారు. పాలీస్టిరీన్ అనేది ప్లాస్టిక్ తరహా పదార్థం.
 • ఫ్యాన్ బ్లేడ్లు, కప్పులు, కంటైనర్లు, కత్తులు, కాస్మెటిక్ ఉత్పత్తుల్లో ఉపయోగించే పదార్థాలను ఇక్కడ తయారుచేస్తారు.
 • ఇక్కడి పరిశ్రమలో స్టిరీన్ అనే ముడిపదార్థం ఉపయోగించి వివిధ రకాల ఉత్పత్తులు తయారుచేస్తారు. స్టిరీన్ అనే పదార్థం అత్యంత వేగంగా మండే స్వభావం కలది. మండినప్పుడు దీన్నుంచి విషవాయువు వెలువడుతుంది.
 • భారత్ లో పాలీస్టిరీన్ ఉత్పత్తుల రంగంలో అగ్రగామి సంస్థగా ఉన్న ఎల్జీ పాలిమర్స్ ఎగుమతుల పరంగానూ ముందంజలో ఉంది.

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనలో 10 కి చేరిన మృతుల సంఖ్య.. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close