టాప్ స్టోరీస్సినిమా
మై బ్రేకప్ స్టోరీ : దీపికా పదుకోణె

రణబీర్- దీపికా పదుకోణె జంట పెళ్లి పీటలు ఎక్కుతుందని అంతా భావించిన తరుణంలో ఒక్కసారిగా వీరు బ్రేకప్ అయ్యారు. దీని వెనుక స్టోరీ ఏమిటో దీపికా పదుకోణె తాజాగా చెప్పుకొచ్చింది. తామిద్దరం రిలేషన్ షిప్ లో ఉండగా, రణబీర్ తనను మోసం చేయడం రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడని, మరో ఛాన్స్ ఇవ్వమని వేడుకున్నాడని, ఇంకోసారి మోసపోవడం ఇష్టం లేకనే విడిపోయామని తెలిపింది.
ఒక రిలేషన్ లో ఉన్నప్పుడు మోసం చేయడం తనకు ఇష్టం ఉండదని, అలా చేస్తే క్షమించనని అభిప్రాయపడింది. దీపికా తర్వాత రణబీర్ మరో బ్యూటీ కత్రీనాతో రిలేషన్ మైంటైన్ చేయగా, ప్రస్తుతం అలియా భట్ తో వ్యవహారం పెళ్లిపీటల వరకు వెళ్లిందనే టాక్ ఉంది. మరో వైపు దీపికా- రణవీర్ సింగ్ల మధ్య వ్యవహారం కూడా మూడు ముళ్ల వరకు వెళ్తుందనేది బాలీవుడ్ టాక్. క్లైమాక్స్ ట్విస్ట్ లు ఏమైనా ఉంటాయేమో ఇప్పుడే చెప్పలేం…!