నా కంట్లో కన్నీళ్ళు ఆగలేదు -అమితాబ్

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతూ కాలం గడుపుతున్నారు. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కరోనా కాటుకి గురవుతున్నారు. ఇటీవల బచ్చన్ ఫ్యామిలీకి చెందిన అమితాబ్, అభిషేక్, ఐశ్వర్యరాయ్, ఆరాధ్య కరోనా బారిన పడగా, రీసెంట్గా ఐష్, ఆరాధ్యలకి నెగెటివ్ అనే తేలింది. దీంతో వారిద్దరిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. అభిషేక్, అమితాబ్ నానావతి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
అయితే తన కోడలు, మనవరాలు కరోనా నెగిటివ్తో డిశ్చార్జ్ అయ్యారనే విషయం తెలిసి కళ్లలో నీళ్లు ఆగలేదని బిగ్ బి అమితాబచ్చన్ తన తాజా ట్వీట్లో పేర్కొన్నారు. నీ ఆశీస్సులు అనంతం అంటూ ట్వీట్ చేశారు. కరోనాతో బాధపడుతున్న అమితాబ్ తన సోషల్ మీడియా ద్వారా అనుభవాలని వివరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బీ కూడా త్వరగా కోలుకొని ఇంటికి వెళ్లాలని యావత్ దేశం ప్రార్ధనలు చేస్తుంది.