అంతర్జాతీయం

కోరలు చాస్తున్న కరోనా.. మరో లక్ష కొత్త కేసులు.. అమెరికాలో 96 వేల మరణాలు..

ప్రపంచవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తూనే ఉంది. నిన్న కొత్తగా లక్ష కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లోనూ కొత్తగా లక్ష కేసులు నమోదయ్యాయి. నిన్న ఉదయానికి మొత్తం కేసులు 50,82,661 ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 51,89,178 కు చేరింది. మరణాల సంఖ్య కూడా పెరిగింది. మొత్తం 3,34,072 మంది కరోనా సోకి మరణించారు. ఒక్క అమెరికాలోనే 96,295 మంది వ్యాధితో చనిపోయారు. ఇక, 20,78,557 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 27,76,549 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 45,635 మంది పరిస్థితి విషమంగా ఉంది. దేశాల వారీగా చూస్తే నిన్న ఒక్క రోజే అమెరికాలో 1,359, బ్రెజిల్ 1,153, మెక్సికో 424, యూకే 338, ఇటలీ 156, రష్యా 127, పెరూ 124, కెనడా 121 మంది కరోనాతో మరణించారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close