అంతర్జాతీయం

Donald Trump: అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ఓటమి తథ్యం…తేల్చి చెప్పిన సర్వే…

ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘోరంగా ఓడిపోతారని ఒక అమెరికన్ అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం ప్రకారం, కరోనా వైరస్ సంక్షోభం తరువాత పేలవమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘోరంగా ఓడిపోతారని తేల్చింది. ఆక్స్‌ఫర్డ్ ఆర్థికవేత్తలు కొత్త ఎన్నికల నమూనా ద్వారా దీనిని అంచనా వేశారు. పెరుగుతున్న నిరుద్యోగిత రేటు, ద్రవ్యోల్బణం కారణంగా అమెరికన్లు ట్రంప్‌ను తిరిగి ఎన్నుకోవడం కష్టమని పేర్కొంటున్నారు. అధ్యయనం ప్రకారం, ట్రంప్ కు 35 శాతం ఓట్లు మాత్రమే లభిస్తాయని తేల్చింది. కరోనా వైరస్ సంక్రమణ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద దెబ్బ తగిలిందని పేర్కింది. కరోనాకు ముందు చేసిన అధ్యయనంలో, ట్రంప్ 55 శాతం ఓట్లు సాధిస్తారని అంచనా వేయగా ప్రస్తుతం ఆ సంఖ్య రివర్స్ అయ్యింది. ట్రంప్ చరిత్రాత్మక ఓటమి కరోనా మహమ్మారి కారణంగా ఉంటుందని ఆక్స్ ఫర్డ్ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. మహా మాంద్యం ట్రంప్‌కు భారీ షాక్‌ కానుంది. అధ్యక్ష ఎన్నికల్లో ఒకవేళ ట్రంప్ విజయం సాధిస్తే అది అద్భుతం అవుతుందని నివేదిక పేర్కొంది. అయితే కరోనా వైరస్ కారణంగా అలాంటి మాయాజాలం ఉండటం కష్టమని పేర్కొంది.

అధ్యక్ష ఎన్నికలలో అంచనాకు సంబంధించి అమెరికాలో ఈ అధ్యయనం చాలా ఖచ్చితమైనదని పేరుంది. 1948 నుండి ఇప్పటి వరకు, ఈ మోడల్ చాలా ఖచ్చితమైన అంచనాలను తెలిపింది. కేవలం 1968 మరియు 1976 లో మాత్రమే దాని అంచనా విఫలమైంది. ఎన్నికల వరకు అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకోదని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. నిరుద్యోగిత రేటు 13 శాతానికి మించగా, గృహ ఆదాయం 6 శాతం కన్నా తక్కువగా ఉంది. మహా మాంద్యం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పరిస్థితి మరింత భయంకరంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. అంతర్జాతీయ సంక్షోభ సమయంలో నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరుకుంటుంని. గృహ ఆదాయం 6 శాతం కంటే తక్కువగా ఉంటుందని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ గాయం కారణంగా ట్రంప్‌ను తిరిగి ఎన్నుకోవడం అసాధ్యమని పేర్కొంటున్నారు. మరోవైపు డెమోక్రటిక్ పార్టీ విజయాన్ని ఆర్థిక అంశాలు స్పష్టంగా చూపిస్తున్నాయని అధ్యయనం చెబుతోంది. ఏదేమైనా, అంటువ్యాధి తరువాత ఓటరు స్వింగ్ ఎలా మారుతుందో చూడాల్సి ఉంది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close