జాతీయం

ఇండియాని చావగొడుతున్న కరోనా… కొత్తగా మరో 6654 కేసులు

Corona Lockdown | Corona Update : దేశాన్ని కరోనా వైరస్ పీక్కు తింటోంది. మనుషుల ఊపిరిత్తుల్లో తిష్టవేసి… చావగొడుతోంది. కొత్తగా 6654 పాజిటివ్ కేసులు రావడంతో… మొత్తం కేసుల సంఖ్య 125101కి చేరింది. ఇది మనం దాదాపు ఊహించని పరిణామమే అనుకోవచ్చు. ఇక… కొత్తగా 137 మంది చనిపోవడంతో… మరణాల సంఖ్య 3720కి చేరింది. తాజా రికవరీ కేసులు… 3250గా ఉన్నాయి. మొత్తం రికవరీలు 51783గా ఉన్నాయి. రికవరీలు ఎక్కువగా ఉన్నాయని ఆనందపడాలో… మొత్తంగా కరోనా పెరిగిపోతోందని టెన్షన్ పడాలో మనమే తేల్చుకోవాలి.

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కరోనా కేసులున్న దేశంలో ఇండియా 11వ స్థానంలో ఉంది. అదే సమయంలో… ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో 4వ స్థానంలో ఉంది. దీనర్థం ఒకటే… దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కొద్దీ… మన స్థానం మరింత పైకి పోవడం ఖాయం. మన దేశంలో జనాభా ఎక్కువ కాబట్టి… ఎక్కువ కేసులు నమోదవుతున్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత… రష్యాను వెనక్కి నెట్టి… ఇండియా మూడో స్థానానికి చేరుకునే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దేశంలో కరోనా కేసుల వివరాలు

ఇక ఇండియాలో అత్యంత దారుణంగా మహారాష్ట్ర ఉంది. అక్కడ రోజూ నమోదవుతున్న కేసులు షాక్ తెప్పిస్తున్నాయి. కొత్తగా 2940 కేసులొచ్చి… మొత్తం కేసులు 44582కి పెరిగాయి. అంటే దేశంలో 30 శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయని తేలుతోంది. ఇక తమిళనాడు, గుజరాత్, ఢిల్లీలో కూడా పది వేలకు పైగా కేసులున్నాయి. అందువల్లే ఇండియాలో ఇప్పట్లో కరోనా కంట్రోల్ కాదనే వాదన వినిపిస్తోంది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close