అంతర్జాతీయంటాప్ స్టోరీస్

జూలై నాటికి కరోనా మహమ్మారి ఖతం

వాషింగ్టన్‌ : కరోనా వైర‌స్‌ మహమ్మారిని నిర్మూలించేందుకు టీకా వేయడం ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రారంభమైంది. భారతదేశంలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌లో ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఆమోదం పొందిన తర్వాత టీకాలు వేయడం  పనులు వేగంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో డ్రై డ్రైవ్‌ నిర్వహించి మంచీ చెడ్డలు గుర్తించే పనిలో ఆరోగ్య శాఖ అధికారులు నిమగ్నమై ఉన్నారు. కరోనా వైరస్ కొత్త జాతులు బయటకు వచ్చిన తరువాత, కరోనా వ్యాప్తి ప్రమాదం 70 శాతం ఎక్కువైంది.

ఈ నేపథ్యంలో వైరాలజీ నిపుణులు, అమెరికా ప్రభుత్వ సలహాదారు ఆంథోనీ  పౌచీ ఊరట కలిగించే వ్యాఖ్యలు చేశారు. వచ్చే జూలై నెలాఖరుకల్లా కరోనా మహమ్మారి అంతం అవుతుందని ఘంటాపథంగా చెప్తున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలు టీకాలు సరిగ్గా పని చేస్తే జూలై నాటికి కరోనా వైరస్ మహమ్మారిని తొలగించవచ్చని తెలిపారు. అయితే, వ్యాక్సిన్‌ను జనాభాలో 70 శాతం ప్రజలకు చేరేలా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వ్యాక్సిన్ సరైన సమయంలో, సరైన మార్గంలో పంపిణీ చేయబడితే జూలై నాటికి కరోనా మహమ్మారిని అంతం చేసే దిశలో ప్రపంచం ఉంటుంది.

కరోనా వైరస్‌ మహమ్మారి అమెరికాపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిందని ఫౌచి చెప్పారు. 2021 ఏప్రిల్ నుంచి జూలై వరకు అమెరికాకు మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తానికి చాలా ప్రత్యేకమైన రోజులని ఫౌచి పేర్కొన్నారు. ప్రజలు కూడా టీకాలకు సహాయం చేసి, సమయానికి టీకాలు వేస్తే, జూలై నాటికి పాఠశాలలు, థియేటర్లు, స్పోర్ట్స్ క్లబ్‌లు, రెస్టారెంట్లు అందుబాటులోకి డాక్టర్ ఫౌచి చెప్పారు. విశేషమేమిటంటే, కరోనాను నియంత్రించాలంటే ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి టీకాలు వేయవలసి ఉంటుందని ఆంధోనీ ఫౌచీ చెప్పకముందే ప్రపంచం కుబేరుడు బిల్‌ గేట్స్ చెప్పడం విశేషం.

కరోనా వ్యాక్సిన్‌ను రెండు మోతాదుల చొప్పున ప్రతి వ్యక్తికి ఇవ్వాలంటే దాదాపు 10 బిలియన్ మోతాదు అవసరం. ఇది చాలా పెద్ద పని. ప్రపంచవ్యాప్తంగా టీకా కంపెనీలు ప్రతి సంవత్సరం 6 బిలియన్ మోతాదులను మాత్రమే అందించే వీలున్నది. ఇటువంటి పరిస్థితిలో టీకా తయారీకి కూడా చాలా సమయం పడుతుందని గుర్తుంచుకోవాలి. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close