జాతీయంటాప్ స్టోరీస్టెక్నాలజీ

వాడిన నూనెను మరో విధంగా వాడనున్న మెక్‌డొనాల్డ్స్

ప్రముఖ రెస్టారెంట్ మెక్‌డొనాల్డ్స్ గురించి అదరికీ తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో, పట్టణాల్లో  హార్డ్ క్యాసిల్  రెస్టారెంట్స్ వీటిని నిర్వహిస్తోంది. వివిధ రకాల బర్గర్లు, శాండ్ విచ్‌లు, డెసర్ట్‌లు, మిల్క్‌ షేక్‌లు శీతల పానీయాలను మెక్‌ డొనాల్డ్స్ తయారు చేస్తుంది. వివిధ పదార్థాల తయారీకి లీటర్ల కొద్దీ వంట నూనె అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో మిగిలి పోతున్న వాడేసిన వంటనూనెను మరో విధంగా ఉపయోగించేందుకు మెక్‌ డొనాల్డ్స్‌ కసరత్తులు చేస్తోంది.

ఇందులో భాగంగా ఆ నూనెను బయో డీజిల్‌గా మార్చి, తన రిఫ్రిజిరేటెడ్‌ ఫుడ్‌ ట్రక్స్‌ను నడిపిస్తోంది. ప్రస్తుతం ముంబయిలోని వివిధ మెక్‌డొనాల్డ్స్‌ రెస్టారెంట్లలో వినియోగించిన వంట నూనెను బయో డీజిల్‌గా మార్చి వాహనాల్లో వినియోగిస్తోంది. ప్రయోగదశలో ఉన్న ప్రాజెక్టును త్వరలో బెంగళూరలోనూ పరీక్షించనున్నారు. ‘ మొత్తం 227 అవుట్‌ లెట్లను రీసైకిల్‌ కార్యక్రమం కిందకు తీసుకువస్తాం ‘ అని సప్లయ్‌ చైన్‌, క్వాలిటీ అష్యూరెన్స్‌, హార్డ్‌క్యాసిల్‌ రెస్టారెంట్ల డైరెక్టర్‌ విక్రమ్‌ ఓగ్లీ తెలిపారు.

ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టును యూనికాన్‌ బయోఫ్యూయిల్స్‌ తో కలిసి మెక్‌డొనాల్డ్స్‌ గతేడాది ప్రారంభించింది. ముంబయి నగరంలోని 85 రెస్టారెంట్ల నుంచి వంట నూనెను సేకరించి, దాన్ని బయోడీజిల్‌గా మారుస్తున్నారు. నెలకు సుమారు 35వేల లీటర్ల వాడేసిన నూనె బయోడీజిల్‌గా మారుతోంది. వంటనూనెను రీసైకిల్‌ చేసి వినియోగించడం వల్ల డీజిల్‌తో పోలిస్తే 75శాతం కార్బన్‌ ఉద్గారాలు తక్కువ వెలువడతాయని చెబుతున్నారు.

గతేడాది నుంచి యూనికాన్‌ బయోఫ్యూయల్స్‌, హార్డ్‌ క్యాసిల్‌ రెస్టారెంట్లు వంట నూనెను బయో డీజిల్‌గా మార్చే ప్రక్రియను చేపట్టాయని, అది బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ ప్రకారమే జరుగుతోందని బయోడీజిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు సందీప్‌ చతుర్వేది తెలిపారు. తాము ఈ ప్రక్రియను ప్రోత్సహిస్తున్నామని, అందరూ ఇలా ఆలోచిస్తే పర్యావరణానికి మేలు చేసిన వారవుతారని ఆయన తెలిపారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close