రాజకీయం

దుబ్బాక‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్‌

సిద్దిపేట : దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ త‌గిలింది. రోజురోజుకు ఆ పార్టీ బ‌ల‌హీన‌ప‌డి పోతోంది. నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కులు న‌ర్సింహారెడ్డి, మ‌నోహ‌ర్ రావులు మంత్రి హ‌రీష్ రావు స‌మ‌క్షంలో గులాబీ గూటికి చేరారు. వీరిద్ద‌రితో పాటు 2 వేల మంది కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరంద‌రికి మంత్రి హ‌రీష్‌రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అభ్య‌ర్థి సోలిపేట సుజాత‌కు భారీ మ‌ద్ద‌తు వ‌స్తుంద‌ని తెలిపారు. ఈ మ‌ద్ద‌తు చూస్తుంటే సుజాత భారీ మెజార్టీతో గెలుస్తుంద‌న్న విశ్వాసం ఉంద‌న్నారు. ఎన్నిక‌ల వ‌ర‌కే ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఇక్క‌డ ఉంటాడు. కానీ తాము 24 గంట‌లు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటామ‌న్నారు. కేవ‌లం ఓట్ల కోస‌మే వ‌చ్చే వాళ్ల‌కు ఓట్లు వేద్దామా? ఇక్క‌డి ప్ర‌జ‌ల‌తో క‌ష్ట‌సుఖాలు పాలు పంచుకునే వారికి ఓటేద్దామా? అని అడిగారు.  గ‌త ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఓట్లు కూడా వ‌స్తాయో.. రావో అని కాంగ్రెస్ నేత‌లు భ‌య‌ప‌డుతున్నారు. పోటీకి సోలిపేట సుజాత అస‌మ‌ర్థురాలు అని ఉత్త‌మ్ మాట్లాడ‌టం స‌రికాద‌న్నారు. దుబ్బాక మ‌హిళా లోకాన్ని ఉత్త‌మ్ కించ‌ప‌రిచాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. తొలిసారి దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గానికి మ‌హిళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వ‌హించ‌బోతుంద‌ని అంద‌రూ సంతోషం వ్య‌క్తం చేస్తున్నార‌ని మంత్రి హ‌రీష్ రావు తెలిపారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close