జాతీయంటాప్ స్టోరీస్బ్రేకింగ్ న్యూస్స్పెషల్

అభిమానమంటే ఇదే: అటల్‌కు ఓ సామాన్యుడి ఘన నివాళి

అటల్‌ బిహారీ వాజ్‌పేయి మరణవార్త ఎంతోమందిని విషాదంలో ముంచెత్తింది. దేశవ్యాప్తంగా అటల్‌ను తలుచుకోని వ్యక్తి గానీ, నివాళులు అర్పించని వ్యక్తిగానీ లేరంటే అతిశయోక్తి కాదు. ఇక ఢిల్లీ వీధులైతే జనంతో కిటకిటలాడిపోయాయి. బీజేపీ కార్యాలయం నుంచి శక్తిస్థల్ వరకూ అంతిమయాత్ర సాగిన మార్గంలో జనం ఇసుక వేస్తే రాలనంతగా నిండిపోయారు. అటల్ పార్థివ దేహంపై పూలు జల్లుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఇక నేతలైతే దేశం నలుమూలల నుంచి తరలివచ్చారు. కొంతమంది బీజేపీ ప్రధాన కార్యాలయంలో నివాళులు అర్పిస్తే, మరికొంతమంది శక్తిస్థల్‌లో అంత్యక్రియలకు హాజరయ్యారు. అయితే, వీరెవరికీ రాని ఆలోచన ఓ సామాన్యుడికి వచ్చింది. శక్తిస్థల్‌కు అటల్‌జీ కోసం వచ్చే ఎంతోమందికి ఉపశమనం కలిగించేందుకు అతను నడుం కట్టాడు. శక్తిస్థల్‌ సమీపంలో ఓ టీకొట్టును పెట్టి వచ్చిన వారందరికీ ఉచితంగా చల్లని మంచినీళ్లు, టీ అందించాడు.

అడిగిన వారందరికీ లేదనకుండా టీ ఇచ్చిన అతడిని అంతా ప్రశంసించారు. అటల్‌ జీకి సంస్మరణగా ఉచిత సేవ అని బోర్డు పెట్టాడు. కొంతమంది డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించినా తీసుకోవాడనికి నిరాకరించాడు. అటల్‌పై సామాన్యుల్లోనూ ఎంత గౌరవం ఉందో చెప్పడానికి ఈ సంఘటనే ఓ ప్రత్యక్ష ఉదాహరణ.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close