టాప్ స్టోరీస్తెలంగాణబ్రేకింగ్ న్యూస్రాజకీయం

గవర్నర్‌తో సమావేశమైన సీఎం కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. ఆదివారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లిన కేసీఆర్‌ గవర్నర్‌తో సమావేశమయ్యారు. త్వరలో నాలుగో విడత హరితహారం, బీసీ స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను సీఎం కేసీఆర్‌ గవర్నర్‌కు వివరించారని సమాచారం. బీసీ పథకాలతో పాటు సంచార జాతులను బీసీ జాబితాలో చేర్పు ప్రతిపాదనలను కూడా గవర్నర్‌కు చెప్పినట్లు తెలుస్తుంది.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధకశాఖ విధానాలు మార్చుకోవాలని అధికారులకు సూచించిన సీఎం కేసీఆర్‌ ఇందుకు సంబంధించి తన అభిప్రాయాలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. శాసనసభ సభ్యత్వాల రద్దు  విషయంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లు హైకోర్టులో ధిక్కార పిటిషన్‌ దాఖలు చేసిన అంశం, 18 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్‌ సమావేశాల అంశం కూడా వీరి చర్చలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close