టాప్ స్టోరీస్తెలంగాణ

నూత‌న స‌చివాల‌యం న‌మూనాపై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

హైద‌రాబాద్ : నూత‌న స‌చివాల‌యం న‌మూనాపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంబంధిత అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఇంజినీర్లు, ఆర్కిటెక్చ‌ర్లు హాజ‌ర‌య్యారు. అర్కిటెక్ట్స్‌ నిపుణులు ఆస్కార్‌-పొన్ని ఇచ్చిన న‌మూనాకు సూత్ర‌ప్రాయంగా ఆమోదం తెలిపిన కేసీఆర్.. కొన్ని మార్పులు, చేర్పులు చేయాల‌ని బుధ‌వారం జ‌రిగిన స‌మావేశంలో ఇంజినీర్ల‌కు, అధికారుల‌కు సూచించారు. అధికారులు, ఇంజినీర్లు క‌లిసి మార్పులు, చేర్పులు చేశారు. ఈ అంశంపైనే అధికారుల‌తో సీఎం చ‌ర్చిస్తున్నారు. 

కొత్త సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల చాంబర్లలో కూడా అన్ని సౌకర్యాలు ఉండాలని గ‌తంలో సీఎం కేసీఆర్ చెప్పిన విష‌యం విదిత‌మే. ప్రతి అంతస్తులో భోజనం చేసేందుకు డైనింగ్‌ హాలు, మీటింగ్‌ హాలు, సందర్శకుల కోసం వెయిటింగ్‌ హాలు ఉండాలని, పార్కింగ్‌ ప్రదేశంలో అన్ని రకాల వాహనాలను నిలిపే సౌకర్యం ఉండాలని స్పష్టంచేశారు. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close