తెలంగాణ

వ‌ట్టికోట సాహిత్య కృషి అజ‌రామ‌రం -సీఎం కేసీఆర్

హైద‌రాబాద్ : తెలంగాణా తొలితరం నవలా సాహిత్యకారుడు వట్టికోట ఆళ్వారుస్వామి స్పూర్తి రాష్ట్రసాధన కోసం సాగిన సాహిత్య సాంస్కృతిక ఉద్యమంలో కీలక భూమికను పోషించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వట్టికోట ఆళ్వారు స్వామి జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయ‌న‌ సేవలను స్మరించుకున్నారు.

పాత్రికేయుడుగా, కథకుడుగా, నవలా కారుడుగా, తెలంగాణ సాయుధ పోరాట కాలంలో తన సాహిత్యంతో ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిన వట్టికోట సాహిత్య కృషి అజరామరం అని సీఎం పేర్కొన్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close