ఆంధ్ర

బద్వేలు ఉప ఎన్నిక గెలుపుపై సీఎం జగన్ స్పందన

  • బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ ఘనవిజయం
  • 90 వేలకు పైగా మెజారిటీతో నెగ్గిన డాక్టర్ సుధ
  • హర్షం వ్యక్తం చేసిన సీఎం జగన్
  • డాక్టర్ సుధమ్మకు అభినందనలు అంటూ ట్వీట్\

కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ 90 వేలకు పైగా మెజారిటీతో ఘనవిజయం సాధించడం పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. బద్వేలులో అఖండ విజయాన్ని అందించిన ప్రతి అక్కచెల్లెమ్మకు, అవ్వాతాతకు, ప్రతి ఆత్మీయ సోదరునికి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ ట్వీట్ చేశారు.

“శాసనసభ్యురాలిగా గెలుపొందిన డాక్టర్ సుధమ్మకు అభినందనలు. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఈ ఘనవిజయం దక్కింది. ఈ గెలుపును ప్రజాప్రభుత్వానికి, సుపరిపానలకు మీరిచ్చిన దీవెనగా భావిస్తాను… ఈ క్రమంలో మరింత మంచి చేసేందుకు కృషి చేస్తాను” అంటూ సీఎం జగన్ ఉద్ఘాటించారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close