
దివంగత ఎస్వీ రంగారావు మహా నటుడిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ఆయన అంతటి స్థాయి ఉన్న నటులు లేరని, భవిష్యత్తులో రాలేరని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఎన్వీఆర్ శత జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ఎస్వీఆర్ కాంస్య విగ్రాహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. ఆనంతరం ఆయ మాట్లాడుతూ.. ఎన్టీఆర్, ఎస్వీఆర్ కాంబినేషన్లో ఎన్నో మంచి చిత్రాలు వచ్చాయని చెప్పారు. ఆణిముత్యాలాంటి చిత్రాల్లో అద్భుతంగా నటించి గొప్ప నటుడిగా పేరుగాంచారని తెలిపారు. తెలుగు ప్రజలు గొప్పగా చెప్పుకునే నటుల్లో ఎస్వీఆర్ ఒకరని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీపరిశ్రమకు చెందిన వేణుమాధవ్, శివాజీరాజా, పరుచూరి వెంకటేశ్వరరావు, ఝాన్సీ తదితరులు హాజరయ్యారు.