తెలంగాణ

రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం ఆకాంక్ష

బాల్కొండ: రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం ఆకాంక్ష అని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన వేల్పూర్ మండల కేంద్రంలో పల్లె ప్రగతి రెండవ విడతలో భాగంగా మండల పరిధిలోని గ్రామ పంచాయతీల పారిశుధ్యం కొరకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎవరు ఎన్నడూ ఆలోచన చేయని విధంగా గ్రామాలు బాగుపడాలి, పరిశుభ్రంగా ఉండాలి, పచ్చదనంతో కళకళలాడాలని మన సీఎం కేసీఆర్ కోరుకుంటారన్నారు. ప్రజల ఆరోగ్యం ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి పల్లె ప్రగతి కార్యక్రమం మొదలుపెట్టారని తెలిపారు. 30 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, అధికారులు, యువత, మహిళా కమిటీలు, పార్టీలకు అతీతంగా రాజకీయ వ్యవస్థ సమన్వయంతో బ్రహ్మాండంగా పనిచేశారని మంత్రి అన్నారు. గ్రామాలు మెరుగుపడే దిశగా పయనిస్తున్నాయని మంత్రి తెలిపారు.
ఇంకా మంత్రి మాట్లాడుతూ.. నాకు తెలిసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమం దేశంలోని అన్ని కార్యక్రమాలతో పోలిస్తే విశేషంగా విజయవంతమైందని తెలిపారు. ఈ కార్యక్రమం వల్ల పల్లెలు ప్రగతి బాటన పడుతున్నాయని ఆయన అన్నారు. ఈ స్పూర్తితో ప్రతి మూడు నెలలకోసారి పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించి, గ్రామాలు బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో రెండోవిడత పల్లె ప్రగతి చేపట్టడం జరిగిందని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ మాటల మనిషి కాదనీ.. చేతల మనిషని మంత్రి కొనియాడారు. ఆయన చేసిన ప్రతి పనికి అర్థం ఉంటుందని ఆయన తెలిపారు. పల్లె నుంచి పట్టణం దాకా అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం మామూలు విషయం కాదన్నారు మంత్రి.

ప్రతి నెల గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేస్తున్నారు
చెత్త లేకుండా ఉంటే పరిసరాలు, ఇల్లు పరిశుభ్రంగా ఉంటాయి.దీని కోసం తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు ప్రతి ఇంటికి రెండు చెత్త బుట్టలు పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. ఈ చెత్తను తరలించేందుకుగ్రామ పంచాయతీ నిధులతో ప్రతి గ్రామానికి ట్రాక్టర్ సమకూరుస్తున్నామన్నారు. చిన్న గ్రామ పంచాయతీలకు బ్యాంక్ లింకేజీ ద్వారా ట్రాక్టర్ సమకూరుస్తున్నాం. ట్రాక్టర్ తో పాటు నీళ్ల ట్యాంకర్, ట్రాలీ తీసుకోవాలని యోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వేల్పూర్ మండలంలోని 15 గ్రామ పంచాయతీలు ట్రాక్టర్లు తీసుకోవడం సంతోషం. కార్యక్రమానికి సహకరిస్తున్న గ్రామాల సర్పంచ్, ఉప సర్పంచ్, యువకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలకు, అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు.

నా సొంత మండలమైన వేల్పూర్ ను ఆదర్శంగా నిలిపినందుకు సంతోషంగా ఉంది
తన సొంత మండలమైన వేల్పూర్ ను ఆదర్శంగా నిలిపినందుకు సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. పల్లెలు పచ్చగా ఉండాలంటే మొక్కలు పెంచుకోవాలి. దీన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్య క్రమంగా తీసుకున్నారు. మొక్కలు కాపాడడానికి ట్యాంకర్ తో నీళ్లు పోయాలి. వాటిని సంరక్షించుకోవడానికి ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఆచరణ యోగ్యమైన కార్యక్రమంలో వార్డు సభ్యులతో సహా అందరి భాగస్వామ్యం అవసరమని ఆయన పేర్కొన్నారు. అన్ని గ్రామాలు డంపింగ్ యార్డులు, వైకుంఠ దామాలు నిర్మించుకొని ఆదర్శంగా ఉండాలని కోరుతున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు6

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close