ఆంధ్ర

పోలీస్‌ మీట్‌లో అరుదైన సన్నివేశం

డీఎస్పీ కూతురికి సీఐ తండ్రి సెల్యూట్‌!

చిత్తూరు: రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా తిరుపతిలో ఏపీ పోలీస్‌ డ్యూటీ మీట్‌ సందర్భంగా ఓ అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న కూతురు జెస్సీ ప్రశాంతికి సీఐగా విధుల్లో ఉన్న ఆమె తండ్రి శ్యాం సుందర్‌ సెల్యూట్‌ చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న జిల్లా ఎస్పీ వారిద్దరినీ అభినందించారు. కాగా, శాంతిభద్రతల నిర్వహణలోనూ, సాంకేతికంగానూ జాతీయస్థాయిలో రోల్‌ మోడల్‌గా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా తిరుపతిలో ఏపీ పోలీస్‌ డ్యూటీ మీట్‌ను సోమవారం ప్రారంభించారు. 

“ఇగ్నైట్” పేరుతో నిర్వహిస్తున్న ఈప్రప్రథమ పోలీస్‌ డ్యూటీ మీట్‌ను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభించారు. తిరుపతి ఎమ్మార్‌పల్లి ఏఆర్‌ గ్రౌండ్‌లో డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ పర్యవేక్షణలో సోమవారం నుంచి ఈనెల ఏడో తేదీ వరకు జరిగే ఈ డ్యూటీ మీట్‌లో 13 జిల్లాల నుంచి 200 మంది పోలీస్‌ ప్రతినిధులు పాల్గొంటారు. సింపోజియంలు, పోలీస్‌ టెక్నాలజీ స్టాళ్ల నిర్వహణలో మరో వందమంది పోలీసులు పాల్గొంటారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close