సినిమా

దసరా బరిలోకి బాలయ్య..చిరూ ..

  • సెట్స్ పైకి వెళ్లిన కొరటాల
  • వచ్చేనెలలో సెట్స్ పైకి బోయపాటి 
  • దసరాకి సందడి చేయనున్న సీనియర్ హీరోలు 

రంజీవి – కొరటాల సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. సామాజిక సందేశంతో కూడిన వినోదభరిత చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో కథానాయికగా త్రిష నటించనున్నట్టు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేయమని ముందుగానే చిరంజీవి చెప్పి ఉండటం వలన, కొరటాల అదే పనిలో వున్నారు. దసరా పండుగకి ఈ సినిమాను విడుదల చేసే దిశగా ప్లాన్ చేసుకున్నారు.

ఇక బాలకృష్ణ సినిమా కూడా దసరా బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. వచ్చేనెల 15వ తేదీ నుంచి బాలకృష్ణ – బోయపాటి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. దసరా బరిలో తమ సినిమా వుండవలసిందేనని బోయపాటితో బాలకృష్ణ గట్టిగానే చెప్పారని అంటున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా హీరో శ్రీకాంత్ కనిపించనుండటం విశేషం.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close