అంతర్జాతీయంటాప్ స్టోరీస్

చైనా భారీ మూల్యం చెల్లించక తప్పదు -ట్రంప్‌

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం తనకు అందించిన కరోనా వైరస్‌ చికిత్సపై వైద్య సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన కొవిడ్‌ బారినపడ్డ అమెరిక్లకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తానని, ఎవరూం ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వైరస్‌ సోకడం మీ (అమెరిక్ల) తప్పుదు కాదు.. చైనాదన్నారు. ఇదంతా జరిగింది.. మీ తప్పు కాదని, ఈ దేశానికి చేసిన దానికి చైనా భారీ మూల్యం చెల్లించబోతోందని ట్రంప్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన వీడియో ప్రసంగంలో పేర్కొన్నారు. ట్రంప్‌ తనకు కరోనా చికిత్స ఉపయోగించిన ఔషధాలపై ప్రశంసించారు. ఈ మందులు వైరస్‌ నివారణకు టీకాల వలే ముఖ్యమైనవన్నారు. ‘నేను హాస్పిటల్‌లో నాలుగు రోజులు గడిపానని, తక్కువ వ్యవధిలో కోలుకున్నానని తెలిపారు.

హాస్పిటల్‌లో రెజెనెరాన్ అనే మందును ఇచ్చారని, దీన్ని తీసుకున్న వెంటనే మంచి అనుభూతిని పొందగాలిగానన్నారు. నేను ప్రస్తుతం ఎలా చేయగలుగుతున్నానో.. మూడు రోజుల క్రితం అలాగే అనిపించింది’ అని అన్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ల తయారీపై ట్రంప్‌ మాట్లాడారు. జాన్సన్.. జాన్సన్, మోడరనా వంటి అనేక కంపెనీలు తయారు చేస్తున్న వ్యాక్సిన్లు చివరి దశలో ఉన్నాయని తెలిపారు. త్వరగానే గొప్ప వ్యాక్సిన్‌ను చేయబోతున్నామని చెప్పారు. గతవారంలో ట్రంప్‌, మెలానియా దంపతులు కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. దీంటో ట్రంప్‌ వాల్టర్‌ రీడ్‌ నేషనల్‌ మిలటరీ హాస్పిటల్‌లో చేరారు. సోమవారం ట్రంప్‌ హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జై.. వైట్‌హౌజ్‌కు చేరుకున్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close