అంతర్జాతీయంటాప్ స్టోరీస్

భార‌త్‌కు మేం ఎప్పుడూ ముప్పు కాదు -‌చైనా

భారత్‌తో తాము ఎల్ల‌ప్పుడూ స్నేహాన్ని, సత్సంబంధాలనే కోరుకుంటామని చైనా రాయబారి స‌న్ వేడాంగ్ అన్నారు. భారత్‌కు చైనా ఎప్పుడూ వ్యూహాత్మక ముప్పు కాదని చెప్పారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా కొన్ని కీలక అంశాల్లో రెండు దేశాల మధ్య స్పష్టమైన అవగాహన రావాల్సి ఉంద‌ని పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న తాత్కాలిక విభేదాలు, వివాదాలను బూచిగా చూపి వేల ఏండ్లుగా ఉన్న సత్సంబంధాల చరిత్రను మ‌రువ‌డం సరికాదన్నారు.  

ఏ దేశానికైనా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారే ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద ప్రమాదమని స‌న్ వేడాంగ్ చెప్పారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకదానితో మరొకటి పెనవేసుకుని ఉన్నాయని, ఈ వ్యాపార బంధాలను బలవంతంగా తుంచేసుకుంటే అది రెండు దేశాలకు ఓటమిగా మిగిలిపోతుందని అన్నారు. కాగా, గల్వాన్ ఉద్రిక్తతల‌ తర్వాత 59 చైనా యాప్‌ల‌పై భార‌త్ నిషేధం విధించింది. అదే సమయంలో చైనాకు సంబంధించిన పలు కాంట్రాక్టులను కూడా రద్దు చేసింది. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close