టాప్ స్టోరీస్బ్రేకింగ్ న్యూస్సినిమా
చి॥ల॥సౌ ట్రైలర్ రిలీజ్

సుశాంత్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘చి॥ల॥సౌ॥’. రుహానీ శర్మ కథానాయిక. హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శనివారం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను నాగార్జున విడుదల చేశారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై జస్వంత్ నడిపల్లి, నాగార్జున అక్కినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వెన్నెల కిషోర్, అనుహాసన్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి స్వరాలు సమకూర్చారు.