ఆంధ్రబ్రేకింగ్ న్యూస్

కృష్ణా డెల్టాను ఖుషీ చేసిన చంద్రబాబు

అక్టోబర్‌లో పోలవరం మొదటి గేటు ఏర్పాటు చేస్తామన్న సీఎం

విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేశారు. తూర్పు డెల్టా స్లూయిస్ ద్వారా నీటిని విడుదల చేసిన ఆయన తూర్పు డెల్టాలో 7.36 లక్షల ఎకరాలకు సాగునీరును అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పట్టిసీమ నుంచి విడుదల చేసిన గోదావరి నీరు కృష్ణానదికి చేరుకోవడంతో, ప్రకాశం బ్యారేజ్ నుంచి 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశామన్నారు.

వారం రోజుల ముందే నీటి విడుదల

కృష్ణా కాల్వలో గంగపూజ నిర్వహించిన ఆయన గతేడాది కంటే వారం రోజుల ముందే కాల్వకు నీరు విడుదల చేశామన్నారు. పశ్చిమ డెల్టా కాల్వకు మరో రెండు రోజుల తర్వాత సాగునీరు విడుదల చేయనునట్టు ముఖ్యమంత్రి తెలిపారు.

త్వరలోనే వైకుంఠపురం బ్యారేజీ

గోదావరి- పెన్నా నదులను అనుసంధించడానికి ప్రయత్నిస్తున్నామని, వైకుంఠపురం బ్యారేజీకి త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. వైకుంఠపురం బ్యారేజీ వద్ద 10 టీఎంసీల నీటిని స్టోర్ చేసే విధంగా నిర్మాణాలను చేపడతామని ఆయన పేర్కొన్నారు. గొలుసుకట్టు చెరువులను తిరిగి అభివృద్ధి చేసి, భూగర్భ జలాలను పెంచే విధంగా కార్యక్రమాలను చేపడతామని సీఎం తెలిపారు.రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలని కొందరు చూస్తున్నారని, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రజలే తిప్పికొడతారని ఎద్దేవా చేశారు.

అక్టోబర్‌లో పోలవరం మొదటి గేటు

అక్టోబర్ లో పోలవరం మొదటి గేటును ఏర్పాటు చేస్తామనిఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, బుద్ద ప్రసాద్, ఎమ్మెల్యే బచ్చుల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close