రాజకీయం

వైఎస్ వర్ధంతికి లేని నిబంధనలు వినాయకచవితికి ఎందుకు? -చంద్రబాబు

  • టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం
  • వినాయకచవితి అంశంపై చర్చ
  • ఈ నెల 10న పూజాకార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానం
  • ఆంక్షలు ఎందుకంటూ ఆగ్రహం

పార్టీ ముఖ్యనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ నెల 10న వినాయకచవితి పూజా కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించారు. వినాయకచవితి వేడుకలపై ప్రభుత్వ నిర్ణయాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా తప్పుబట్టారు. వినాయకచవితి పూజలపై ఆంక్షలు ఎందుకు పెడతారని ప్రశ్నించారు. వైఎస్ వర్ధంతికి లేని నిబంధనలు వినాయకచవితికి మాత్రమే ఎందుకని నిలదీశారు.

ఇతర అంశాలపైనా చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. దిశ చట్టం ఎక్కడుందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. బాధిత మహిళలకు న్యాయం జరగాల్సి ఉందని, ఈ నెల 9న నరసరావుపేటలో నిరసన కార్యక్రమం చేపడతామని వెల్లడించారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close