క్రైమ్

ప్రముఖ న్యూస్‌ చానల్‌ విలేకరినంటూ..

నకిలీ విలేకరిపై కేసు నమోదు 

అనంతపురం జిల్లా : టీవీ రిపోర్టర్‌గా చెప్పుకుని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న యువకుడిపై ఓడీ చెరువు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ గోపి తెలిపిన మేరకు.. గత నెల 24న మహేంద్రనాయక్‌ అనే యువకుడు తాను ఓ ప్రముఖ న్యూస్‌ చానల్‌ విలేకరినంటూ ఓడీ చెరువు మండలం కొండకమర్ల ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు టీ భాస్కర్‌ను కలిసి పరిచయం చేసుకున్నాడు.

ఆ పాఠశాలలో పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్న జయలక్ష్మికి సంబంధించిన అనుమతుల పత్రాల నకళ్లు కావాలని అడిగాడు. తప్పుడు విధానంలో ఆమెను ఎంపిక చేశారని, తనకు డబ్బు ఇస్తే ఈ విషయం వెలుగు చూడకుండా ఉంటుందని, లేకపోతే తమ న్యూస్‌ చానల్‌లో ప్రసారం చేస్తానంటూ బెదిరించాడు. ఈ విషయంగా ఆ న్యూస్‌ చానల్‌ ప్రతినిధులతో భాస్కర్‌ నేరుగా మాట్లాడి, అతను నకిలీ అని ధ్రువీకరించుకుని, పుట్టపర్తి డివిజన్‌ న్యూస్‌ చానల్‌ ప్రతినిధి కేశవతో కలిసి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close