క్రైమ్టాప్ స్టోరీస్తెలంగాణబ్రేకింగ్ న్యూస్

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ఇరుక్కున్న ఖాకీలు

హైదరాబాద్ డ్రంక్ అండ్ డ్రైవ్‌ త‌నిఖీలో విచిత్రమైన కేసు నమోదైంది. వాహనదారులను త‌నిఖీ చేస్తున్న స‌మ‌యంలో జహీరుద్దీన్ అనే వ్యక్తికి రీడింగ్ 43 పాయింట్లు చూపించింది. అతనిపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐతే.. తాను మద్యం తాగలేదని, కావాలంటే రక్త పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమ‌ని జ‌హీరుద్దీన్ ట్రాఫిక్ పోలీసుల‌తో వాదించాడు. ఈ విషయంపై పోలీసులకు- అతనికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తాను తాగలేదని చెబుతున్నా వినకుండా కేసు ఎలా పెడతారంటూ ప్ర‌శ్నిస్తూ గొడవకు దిగాడు. చివ‌ర‌కు సుల్తాన్ బజార్ పోలీసుస్టేష‌న్‌లో ట్రాఫిక్ వాళ్లపైనే కేసు పెట్టాడు. అతను తాగాడో లేదో నిజానిజాలు నిర్థారించేందుకు ఉస్మానియా ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. తీరా అందులో అన్నీ నార్మల్ రావడంతో పోలీసులు అవాక్క‌య్యారు.

తాను ఐదు పూటలా నమాజ్ చేస్తానని, తనకు మద్యం అలవాటు లేదని సయ్యద్ జహీరుద్దీన్ చెప్పుకొచ్చాడు. ఐతే.. చెకింగ్స్ సమయంలో మీటర్ 43 పాయింట్లు ఎందుకు చూపిందన్నది పెద్ద చర్చనీయాంశమైంది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల కోసం వాడుతున్న మెషీన్లు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అన్న సందేహం ఇప్పుడు అంద‌రిలో కలుగుతోంది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close