రాజకీయం

సిద్ధూకు ఫోన్ చేసిన పంజాబ్ సీఎం.. ఏం చెప్పారంటే

  • రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారిన విద్యుత్ కొరత
  • గ్రామాల్లో చాలా ఇళ్లలో మీటర్లు తొలగించిన వైనం
  • ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ
  • సిద్ధూ-కెప్టెన్ వార్ విషయంలో సిద్ధూతో మాట్లాడినట్లు వెల్లడి

పంజాబ్‌లో హాట్ టాపిక్‌గా మారిన అంశాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ స్పందించారు.  ‘‘తాను రెగ్యులర్‌గా గ్రామాల్లో పర్యటిస్తున్నానని చన్నీ చెప్పారు. అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది ప్రధాన సమస్యగా ఉందని తెలిపారు. భారీగా ఉన్న బిల్లులు కట్టకపోవడంతో చాలా ఇళ్లలో మీటర్లు కూడా తొలగించారు’’ అని చన్నీ తెలిపారు.  కాంగ్రెస్‌లో సిద్ధూ వర్గానికి చన్నీ సన్నిహితుడనే సంగతి తెలిసిందే.

పంజాబ్‌లో ఎలక్ట్రిసిటీ సమస్యపై కూడా చన్నీ స్పందించారు. రాష్ట్రంలో కరెంటు బిల్లులు కట్టలేని 53 లక్షల కుటుంబాల బాధ్యతను తాము తీసుకుంటామని చెప్పారు. వీరిలో 75-80శాతం మంది 2కేడబ్ల్యూ కేటగిరీలోకి వస్తారని, వీరి చివరి బిల్లులను తాము చూసుకుంటామని హామీ ఇచ్చారు. బిల్లులు కట్టలేదని తొలగించిన కనెక్షన్లను మళ్లీ పునరుద్ధరిస్తామని తెలిపారు.

ఇదే క్రమంలో సిద్ధూ-కెప్టెన్ యుద్ధంపై కూడా స్పందించారు. ఈ గొడవలోనే తాజాగా పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావించిన చన్నీ తాను సిద్ధూకు ఫోన్ చేసినట్లు చెప్పారు. ‘‘పార్టీ చీఫ్ ఎవరైనా సరే, అతను కుటుంబ పెద్ద వంటి వాడు. అందుకే నేను సిద్ధూకు ఫోన్ చేశా. కూర్చొని మాట్లాడుకుందామని, సమస్యను పరిష్కరించుకుందామని చెప్పా’ అని పేర్కొన్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close